ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా గదిలో దొరికిపోయిన భార్య.. భర్త ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు

by Ajay Maddhiboyina |

తమిళనాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్దరాత్రి ఓ మహిళ తన భర్తకు ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో తాను తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ భర్త సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా గదిలో దొరికిపోయిన భార్య.. భర్త ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్దరాత్రి ఓ మహిళ తన భర్తకు ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో తాను తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ భర్త సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రాజా ఆత్విక్ దేవ్ అనే వ్యక్తి ఈ వీడియోలను షేర్ చేయగా ఇన్ స్టా, ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో మహిళ ఓ గదిలో తన ప్రియుడితో ఉండగా అదే సమయానికి భర్త ఎంట్రీ ఇచ్చాడు. భర్త రాగానే మహిళ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది.

దీంతో భర్త వీడియో తీస్తూ లోపల ఎవరు ఉన్నారు.. అని ప్రశ్నించగా ఎవరూ లేరు.. అంటూ సమాధానం ఇస్తోంది. అంతేకాకుండా ఎందుకు అరుస్తున్నావ్ అంటూ అతడిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ డ్రెస్ ఏంటి.. అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ అంటూ భార్యను నిలదీసిన భర్త చివరికి ఆమెపై చేయిచేసుకున్నాడు. చివరికి గదిలో నుండి ఆమె ప్రియుడు బయటకు వచ్చాడు. ఇక ఇది జరిగిన తరవాత భర్త తను కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని మరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను తన భార్యను ఎంతగానో ప్రేమించానని కానీ ఇలా మోసం చేస్తుందని అనుకోలేదని చెప్పాడు.

అతడికి చేతులకు దుస్తులకు రక్తం మరకలు కనిపిస్తుండగా, తాను తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో సైతం వైరల్ అవ్వడంతో నెటిజన్లు అతడిని రక్షించాలి అంటూ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. భర్తను మోసం చేసిన ఆ మహిళను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజా ఆత్విక్ దేవ్ ఇన్ స్టాలో తన భార్యతో కలిసి ఎంతో ప్రేమగా దిగిన ఇతర ఫోటోలు, వీడియోలు సైతం ఉన్నాయి. అవి చూసిన నెటిజన్లు ఇంతమంచివాడిని ఎలా మోసం చేశావంటూ ఆమెపై మండిపడుతున్నారు.

Next Story