- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో BSNL సేవలు మెరుగుపరచాలి: ఎంపీ రఘురాం రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో అందించాలని, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు లేకుండా నిరంతరాయంగా సేవలు అందేలా చూడాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అధికారులను ఆదేశించారు

దిశ, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో అందించాలని, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు లేకుండా నిరంతరాయంగా సేవలు అందేలా చూడాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ లోని తన నివాసంలో టెలికాం విభాగం (DoT), ఏపీఎల్ఎస్ఏ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి. భాస్కరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ జి. గణేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ కె.లక్ష్మణ కుమార్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సి. రమణలతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర టెలికాం కార్యదర్శిని కలిసి ఉభయ జిల్లాల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యను అధిగమించడానికి 25 నూతన టవర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు గుర్తు చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, సరిహద్దు గ్రామాల్లో ఫోన్, ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నెట్‌వర్క్ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను గుర్తించి, సత్వరం చర్యలు తీసుకోవాలని ఎంపీ ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులు, సాంకేతిక అంశాలను ఎంపీకి వివరించారు.






