మ‌క్త‌ల్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-04 10:59:50  IST  )

ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం మక్తల్ కు చేరుకున్నారు.

మ‌క్త‌ల్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ‌, మ‌క్త‌ల్ : ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం మక్తల్ కు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మక్తల్.. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాట్రపల్లి గ్రామం వద్ద జరుగుతున్న పంపు హౌస్ పనులను పరిశీలించారు. పనులకు సంబంధించిన వివరాలను గురించి మంత్రి శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డికి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి వివరించారు. సాయంత్రం వరకు జూరాల, కోయిల సాగర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించి ఏరియల్ సర్వే చేసి రాత్రికి సోమశిల చేరుకుంటారు. అక్కడే ప్రాజెక్టుల స్థితిగతుల గురించి అధికారులతో చర్చిస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజు, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ వాకిటి శ్రీహరి, కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక, ఇరిగేషన్ కార్యదర్శి శ్రీదర్, చీఫ్ ఇంజనీరు. ఏ సత్య నారాయణ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్.టి శ్రీధర్ ఉన్నారు.

Next Story