పర్యావరణ పరిరక్షణపై సందేశం.. ఆకట్టుకుంటున్న ‘దేవిన సిస్టర్స్’ సైకత శిల్పం

by Ramesh Naini |

జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది.

పర్యావరణ పరిరక్షణపై సందేశం.. ఆకట్టుకుంటున్న ‘దేవిన సిస్టర్స్’ సైకత శిల్పం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘దేవిన సిస్టర్స్’గా పేరొందిన చిన్నారులు సోహిత, ధన్యత ఈ కళాకృతిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ‘సేవ్ నేచర్’, ‘స్టాప్ వార్’, ‘గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించండి’ అనే నినాదాలతో పాటు, ప్లాస్టిక్ నిషేధం, కాలుష్య నివారణకు మొక్కల ఆవశ్యకతను వివరిస్తూ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. మూడు యూనిట్ల ఇసుకను ఉపయోగించి సుమారు 12 గంటల పాటు శ్రమించి వారు దీనికి ప్రాణం పోశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల సందర్భంగా ఆయా అంశాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావడానికే తాము తమ వంతు కృషిగా ఇలాంటి కళాకృతులను రూపొందిస్తుంటామని చిన్నారులు తెలిపారు.

Next Story