Kangana Ranaut : ఆ డ్రెస్‌లో గుడికొచ్చిన అమ్మాయి.. తిట్టిపోసిన కంగన

by Dishanational2 |
Kangana Ranaut : ఆ డ్రెస్‌లో గుడికొచ్చిన అమ్మాయి.. తిట్టిపోసిన కంగన
X

దిశ, సినిమా: హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రాలోని బైజ్‌నాథ్ ఆలయంలోకి ఒక అమ్మాయి నైట్ డ్రెస్ వేసుకుని రావడంపై కంగనా రనౌత్ ఫైర్ అయింది. తాజాగా ఓ ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేయగా తెగ వైరల్ అయింది. దీంతో తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన కంగన షార్ట్‌లో వచ్చిన గర్ల్‌ను ‘అవివేకి.. మూర్ఖురాలు.. సోమరిపోతు’ అని తిట్టింది. ‘ఇవి పాశ్చాత్య దుస్తులు. తెల్లవారు కనుగొన్నారు. క్యాజువల్స్ లాగా నైట్ డ్రెస్‌లు వేసుకుని గుడికి వచ్చే ఈ దుర్మార్గులది బద్ధకం తప్ప మరొకటి కాదు. ఇలాంటి మూర్ఖుల కోసం కఠినమైన నిబంధనలు ఉండాలి. పబ్ లేదా నైట్‌క్లబ్‌కు వెళ్లినట్లుగా బైజ్‌నాథ్ ఆలయానికి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఒకప్పుడు షార్ట్‌, టీ-షర్ట్ ధరించినందుకు నన్ను ప్రాంగణంలోకి కూడా అనుమతించలేదు. తిరిగి వెళ్లిపోయా’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.

Also Read: అక్కడ ఉన్న టాటూ చూపిస్తూ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన నిహారిక.. ఫొటోస్ వైరల్..

Next Story