- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో మణిరత్నం అంటే నాకు అసూయ.. ఎలా ఆలోచిస్తాడో
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం టాలెంట్‌పై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..

దిశ, సినిమా : ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం టాలెంట్‌పై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కమల్ మాట్లాడుతూ.. ‘అందరిలాగే ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆనందంగా ఉంది. మణిరత్నాన్ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఆయనకు ఇంత గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిపోతుంది. ఈ మూవీతోపాటు డైరెక్టర్, చిత్ర బృందాన్ని పొగడటానికి నాకు పదాలు దొరకడంలేదు. ఇంతకాలంగా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. విక్రమ్, కార్తి, త్రిష, జయం రవి, ఐశ్వర్యరాయ్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఏప్రిల్ 28న విడుదలకానుంది.
ఇవి కూడా చదవండి: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘రావణాసుర’ ట్రైలర్






