jnr NTRను దూరం పెడుతున్న నందమూరి ఫ్యామిలీ.. ఆ విషయంలోనేనా?

by Disha Web Desk 8 |
jnr NTRను దూరం పెడుతున్న నందమూరి ఫ్యామిలీ.. ఆ విషయంలోనేనా?
X

దిశ, సినిమా : తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి ఫ్యామిలీ సపోర్టు లేకుండా పాన్ ఇండియా లెవల్‌కు ఎదిగి పోయాడు.ఇక బాలకృష్ణ తర్వాత నందమూరీ ఫ్యామిలీని నిలబెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. కొన్ని రోజుల నుంచి నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్నాయంట.

జూనియర్ ఎన్టీఆర్‌కు, నందమూరి,నారా ఫ్యామిలీకి కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయంట. కావాలనేవారు ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్నారని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే ఎక్కువ ఓట్లు పడుతాయనే ఆలోచనతో చంద్రబాబు ఎన్టీఆర్‌ను ప్రచారానికి రమ్మంటే ఆయన నో చెప్పాడంట. దీంతో అప్పటి నుంచి బాలయ్య, చంద్రబాబు ఎన్టీఆర్‌ను లైట్ తీసుకున్నారంట.

అంతేకాదు ఆ గొడవల కారణంగానే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు ఎంతో మంది ప్రముఖులు ఆయన్ను కలిశారు. కానీ జూనియర్ ఎన్టీ‌ఆర్ మాత్రం తనను కలవకపోవడమే కాకుండా ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దీంతో వీళ్ల మధ్యగొడవలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Read More..

జూనియర్ NTR ఫ్లెక్సీలు తీయించేయ్ అని బాలకృష్ణ హుకుం (వీడియో)


Next Story

Most Viewed