జూనియర్ NTR ఫ్లెక్సీలు తీయించేయ్ అని బాలకృష్ణ హుకుం (వీడియో)

by Disha Web Desk 4 |
జూనియర్ NTR ఫ్లెక్సీలు తీయించేయ్ అని బాలకృష్ణ హుకుం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గతంలో టీడీపీకి మద్దతుగా నిలచిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా రియాక్ట్ అవ్వలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది. ఇక, గురువారం ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల వేళ బాలకృష్ణ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయ్ అని అక్కడ ఉన్న వారిని ఆదేశించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే, తెల్లవారు జామునే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తర్వాత వచ్చిన బాలకృష్ణ ఫ్లెక్సీ వైపు చూసి మరి తీసేయ్ అని సైగ చేశారు. అంతకు ముందు తన దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తితోనే వెంటనే తీయించేయ్ అనడం వీడియోలో వినిపించింది. ఓ వైపు టీడీపీకి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మద్దతునిస్తుండటం, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశంతో ఏపీ టీడీపీ పాలిటిక్స్ ఎటు దారి తీస్తాయనేది ఉత్కంఠగా మారింది.

Read More..

కూతుర్లు విడాకులు తీసుకున్నా చిరంజీవి, నాగబాబు హ్యాపీగా ఉండడానికి కారణం అదేనా..?

Breaking News: ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన వారసులు




Next Story

Most Viewed