ఛాలెంజ్ స్వీకరించాలి.. మెగాస్టార్ చిరుకు ఝలక్ ఇచ్చిన Jr.NTR

by Dishanational2 |
ఛాలెంజ్ స్వీకరించాలి.. మెగాస్టార్ చిరుకు ఝలక్ ఇచ్చిన Jr.NTR
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్రహ్మస్త్రం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జూనీయర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రలలో నటించిన బ్రహ్మాస్త్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృదం హైదరాబాద్ పార్క్ హయాత్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న తారక్.. ప్రస్తుతం గ్లోబల్ సినిమానే ఒత్తిడికి లోనవుతుంది. దానికి కారణం ప్రేక్షకులు మన నుంచి ఏదో కొత్తది కోరుకుంటున్నారు. అందుకోసం మనం రెడీగా ఉండాలి. ఒత్తిడిని జయించి, దాన్ని ఛాలెంజ్‌గా ఇండస్ట్రీ స్వీకరించాలి. తద్వారా మంచి సినిమాలు వస్తాయి, అందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించాలి అప్పుడే మనం ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించగలం అన్నారు. అందరూ ఇది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను, నేను ఎవరినీ తక్కువ చేయదలుచుకోలేదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త దుమారం లేపుతున్నాయి. ఇటీవలన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్స్‌కు క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్లు కరెక్ట్‌గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చిరు దర్శకులపై ఫైర్ అయ్యారు. దానికి ఉదాహరణ తన సినిమానే అని చెప్పకనే చెప్పాడు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివకు సపోర్ట్ చేస్తూ చిరంజీవికి ఝలక్ ఇచ్చాడంటూ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. అందుకే తారక్ ఆ వ్యాఖ్యలు చేశారని ముచ్చటిస్తున్నారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి : 'బ్రహ్మాస్త్ర' ప్రెస్ మీట్.. అలరించిన ఎన్టీఆర్, రణ్‌బీర్



Next Story

Most Viewed