'బ్రహ్మాస్త్ర' ప్రెస్ మీట్.. అలరించిన ఎన్టీఆర్, రణ్‌బీర్

by Disha Web Desk 6 |
బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్.. అలరించిన ఎన్టీఆర్, రణ్‌బీర్
X

దిశ, సినిమా : హైద‌రాబాద్‌‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం జరగాల్సిన 'బ్రహ్మాస్త్ర' ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో మూవీ యూనిట్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు రాజమౌళి, ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్, నాగార్జున, కరణ్ జోహార్‌తో పాటు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నాడు. 'నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర'. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆద‌రిస్తారని తెలుసు. అలానే మా చిత్రం కూడా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నా. ఇక్కడకు వ‌చ్చిన అక్కినేని, నంద‌మూరి అభిమానులతో పాటు రాజ‌మౌళి ఫ్యాన్స్‌కు కృత‌జ్ఞత‌లు. 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2' వ‌ర‌కు తెలుగు పర్‌ఫెక్ట్‌గా నేర్చుకుంటా' అని తెలిపారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'సొంత గొడ్డపై ఇలా రణబీర్‌తో వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. తను కోరుకున్నది సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అన్నారు. ఇక ఒక తెలుగు నటుడు హిందీ మాట్లాడుతూ హిందీ చిత్రంలో నటించడం కొంచెం కష్టమని అభిప్రాయపడ్డ తారక్.. నాగార్జున బాబాయ్ ఈ సినిమాలో అదరగొట్టి ఉంటాడని ఆశిస్తున్నట్లుగా చెప్పాడు. ఈ మేరకు నాగార్జునతో తనకున్న అనుబంధాన్ని తారక్ గుర్తు చేసుకున్నాడు.

Also Read : ఛాలెంజ్ స్వీకరించాలి.. మెగాస్టార్ చిరుకు ఝలక్ ఇచ్చిన Jr.NTR


Also Read : దీపావళికి 'ధమ్కీ' ఇస్తానంటోన్న విశ్వక్ సేన్..



Next Story

Most Viewed