దొంగచాటున మా పర్సనల్ వీడియో తీసి అమ్ముకున్నారు.. జెన్నిఫర్

by Dishanational4 |
దొంగచాటున మా పర్సనల్ వీడియో తీసి అమ్ముకున్నారు.. జెన్నిఫర్
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇటీవలే బెన్ అఫ్లెక్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఎవరో అనుమతి లేకుండా తమ మ్యారేజ్‌‌ను చిత్రీకరించి భారీ ధరకు అమ్ముకున్నట్లు ఆరోపించింది. మూడు రోజుల మ్యారేజ్ ఈవెంట్‌లో భాగంగా తాము ఆడిపాడిన సంతోష సమయాలను దొంగచాటున రికార్డు చేశారన్న ఆమె.. వేడుకకు హాజరైనవారంతా 'నాన్-డిస్‌క్లోజర్‌' అగ్రిమెంట్‌పై సంతకం చేశారని పేర్కొంది. అయినప్పటికీ డబ్బు కోసం నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది. ఇదే విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్న సింగర్.. పర్మిషన్ లేకుండా తీసిన వీడియోను ఎవరితో పంచుకోవద్దని అభిమానులను రిక్వెస్ట్ చేసింది. పెళ్లి వంటి వ్యక్తిగత సంతోషాలకు సంబంధించిన అంశాలను ఇతరులతో పంచుకోవాలా? వద్దా? అనేది తమ ఇష్టమన్న జెన్ని.. ఫ్యాన్స్ ఎప్పుడూ తన మాట వింటున్నందుకు ధన్యవాదాలు తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి

శృంగారంపై విరక్తి కలిగిందా..? అయితే మీరు ఈ కేటగిరీకి చెందినవారే!

బహిరంగంగా సెక్స్ టాయ్ ఉపయోగించిన ప్లేయర్.. వీడియో వైరల్

Next Story

Most Viewed