శృంగారంపై విరక్తి కలిగిందా..? అయితే మీరు ఈ కేటగిరీకి చెందినవారే!

by Disha Web Desk 6 |
శృంగారంపై విరక్తి కలిగిందా..? అయితే మీరు ఈ కేటగిరీకి చెందినవారే!
X

దిశ, ఫీచర్స్ : దాదాపు పది మందిలో ఒకరు లైంగిక విరక్తి(సెక్సువల్ అవెర్షన్-SA) కలిగి ఉన్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. సెక్స్‌‌పై ఇంట్రెస్ట్ లేకపోవడం లైంగిక, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేయడమే కాక బంధాలను విచ్ఛిన్నం చేస్తుందని పేర్కొంది. 1935 మంది కెనడియన్స్ పాల్గొన్న ఈ ఆన్‌లైన్ సర్వేలో లైంగిక సంక్షేమం గురించి తెలుసుకునే ప్రయత్నించిన నిర్వాహకులు.. మల్టీవియారిట్ లాజిస్టిక్ రిగ్రెషన్ విశ్లేషణలను ఉపయోగించి SAతో అనుబంధించబడిన సెక్సువల్ డిఫికల్టీస్‌ను కూడా గుర్తించారు.

వయోజన జనాభాలో SA ప్రాబల్యం రేటు మొత్తం 9.7 శాతం ఉండగా.. పురుషుల్లో 6.9 శాతం, స్త్రీలలో 11.3 శాతం, నాన్ బైనరీ/ట్రాన్స్ ఇండివిజువల్స్‌లో 17.1 శాతం ఉన్నట్లు తెలిపారు. మల్టీవియారిట్ విశ్లేషణ ప్రకారం 31 శాతం లైంగిక విరక్తి.. మానసిక క్షోభ, లైంగిక సంతృప్తి, లైంగిక పనితీరుపై ఆందోళన, లైంగిక సంబంధిత సమాచారంతో అసౌకర్యం వంటి విషయాలతో సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొన్నారు.

వివిధ సోషియోడెమోగ్రాఫిక్ సమూహాలలో SA ప్రాబల్యాన్ని డాక్యుమెంట్ చేయడానికి పరిశోధన చాలా కీలకం. SA ఏటియాలజీలో ప్రమేయం ఉన్న అదనపు వ్యక్తిగత మెకానిజమ్స్ గురించి అన్వేషించాల్సి ఉంటుంది. కాగా SAతో నివసించే వ్యక్తుల అవసరాలను గుర్తించి చికిత్స అందిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది - సర్వే

Also Read : అక్కా.. ప్లీజ్ అలా చూపించకు : ఫొటోగ్రాఫర్ చచ్చిపోతాడు

ఇలా Sex చేస్తే జలుబు, ముక్కు దిబ్బ‌డ‌ మాయం

Next Story

Most Viewed