Janhvi Kapoor : పుష్ప2లో జాన్వీ కపూర్.. ఎలా కనిపించనున్నదంటే?

by Disha Web Desk 8 |
Janhvi Kapoor : పుష్ప2లో జాన్వీ కపూర్.. ఎలా కనిపించనున్నదంటే?
X

దిశ, సినిమా :సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈ మూవీలో సమంత ఐటమ్ సాంగ్‌కు చాలా క్రేజ్ వచ్చింది. మూవీ రిలీజ్ అయ్యాక ఎక్కడ చూసినా ఊ.. అంటవా అనే సాంగ్ వినబడినది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించగా, సమంత ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. ఇక ఈ సినిమా హిట్ అందుకోవడంలో సామ్ ఐటమ్ సాంగ్ కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే, పుష్ప సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. 2024 ఆగస్టు 15న పుష్ప2 థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు చర్చంతా ఈమూవీ స్పెసల్ సాంగ్‌ ఎవరు చేయనున్నారని? కాగా, పుష్ప2లో అందాల ముద్దుగుమ్మ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పుష్ప2లో కనిపించనున్నట్టు టాక్.ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది.

ఇక ప్రస్తుతం జాన్వీకపూర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర మూవీలో హీరోయిన్‌‌గా చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు పల్లెటూరి పిల్లలా కనిపించబోతున్నట్లు టాక్. అంతే కాకుండా జాన్వీ చేతిలో తెలుగులో రెండు బడా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ అమ్మడు పుష్ప స్పెషల్ సాంగ్‌లో ప్రేక్షకులను ఎలా అట్రాక్ట్ చేస్తుందో చూడాలంటున్నారు ఫ్యాన్స్.

Read More..

అదిరిపోయే వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య.. ఫ్యాన్స్ ఫిదా


Next Story

Most Viewed