అదిరిపోయే వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య.. ఫ్యాన్స్ ఫిదా

by Disha Web Desk 6 |
అదిరిపోయే వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య.. ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి అందరికీ సుపరిచితమే. ఆమె సినీ రంగంలో ఉండనప్పటికీ సోషల్ మీడియాలో స్నేహా రెడ్డికి ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అల్లు అర్జున్‌లో పాటు తమ పిల్లలు అర్హ, అయాన్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే అల్లు స్నేహా పలు బిజినెస్‌లు చూసుకుంటూనే ఫిట్‌నెస్ విషయంలో సీరియస్‌గా ఉంటుంది. నిత్యం వర్కౌట్ వీడియోస్ షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా, అల్లు స్నేహా తన ఇంటి గార్డెన్‌లో ఉన్న గౌతమబుద్దుడి విగ్రహం వద్ద జిమ్ వర్కౌట్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పెట్టింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ వదినమ్మ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఇంకా వర్కౌట్స్ వీడియోలు షేర్ చేసి ఎంతో మందికి ఇన్సిపిరేషన్‌గా నిలవాలని అంటున్నారు.

Read More..

అలా చెప్పడానికి ఒక్కడుంటే చాలు ఏదైనా సాధించొచ్చు.. అందుకే కనెక్ట్ అయిపోయా: నిహారిక



Next Story