జబర్దస్త్ వర్షకు షాకిచ్చిన ఇమ్మానుయేల్ .. తన గర్ల్‌ఫ్రెండ్‌ను స్టేజీ పైకి తీసుకొచ్చి అసలు విషయం చెప్పేశాడుగా!

by Disha Web Desk 6 |
జబర్దస్త్ వర్షకు షాకిచ్చిన ఇమ్మానుయేల్ .. తన గర్ల్‌ఫ్రెండ్‌ను స్టేజీ పైకి తీసుకొచ్చి అసలు విషయం చెప్పేశాడుగా!
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది నటీనటులు తమ టాలెంట్‌తో అందరి మెప్పును పొందారు. అంతేకాకుండా ఎంతో మందిని నవ్విస్తూ.. ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలాగే కొందరు సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ బిగ్ స్క్రీన్‌పై కూడా తమ సత్తా చూపుతున్నారు. అయితే జబర్దస్త్ షో వల్ల మంచి గుర్తింపు సంపాదించుకున్న లిస్ట్ ఇమ్మానుయేల్, వర్ష కూడా ఉన్నారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు ఎన్నోసార్లు స్టేజీపై మాట్లాడుకోవడం వంటివి చేసి ప్రత్యేక ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు.

దీంతో వాళ్లు లవ్ ట్రాక్ కొనసాగిస్తూనే షోలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు కలిసి ప్రేమ కావాలి షోలో యాంకర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రేమ కావాలి షోకు లంబసింగి చిత్రబృందం వచ్చింది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో హీరోయిన్‌గా నటించి బిగ్‌బాస్ బ్యూటీ దివి వచ్చింది. ఈ క్రమంలో ఇమ్మానుయేల్ వచ్చి దివిని చూసి సిగ్గుపడుతూ నా క్రష్ అని అంటాడు. చాలా కాలం నుంచి తనను ఇష్టపడుతున్నానని అని చెప్తాడు. దానికి దివి నవ్వుతూ సరదాగా కొడుతూ మెలికలు తిరిగిపోతూ మురిసిపోయింది. ఇక ఆ తర్వాత వర్ష ప్రేమించడంలో అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప అనగా.. వీరిద్దరూ కలిసి చక్కగా ప్రేమించుకుంటూ, ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ ఇద్దరూ ఎదగడం గొప్ప అంటూ చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత స్టూడెంట్స్‌కు టాస్కులు ఇచ్చారు. ప్రోమో చివరిలో దివి ప్రేమ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. నేను నీతో బతకాలి అనుకుంటున్నాను. పెళ్లి చేసుకుందాం. నువ్వెలా ఉన్నా పర్లేదు నేను నిన్ను చూస్తుంటాను ఐ లవ్ యూ. నీ క్కూడా ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతుండగా ఇవన్నీ ఇమ్మానుయేల్ కోసం చెప్పిందా.. సినిమాలోని డైలాగా అని చర్చించుకుంటున్నారు. అసలు విషయం తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ విడుదలయ్యే దాక వెయిట్ చేయాల్సిందే.


Read More..

రోడ్డు ప్రమాదంలో స్టార్ సింగర్ మంగ్లీకి గాయాలు.. అసలు ఏం జరిగిందంటే?

Next Story

Most Viewed