ఆయనలో డ్యాన్స్ ఏ కాదు.. తెలియని ఎనర్జీ కూడా ఉంటుంది.: అవికా గోర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-18 10:59:11  IST  )

అల్లు అర్జున్ గారు తనను తాను తీర్చిదిద్దుకునే విధానం నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా ఆయన డాన్స్ చేసే తీరు అద్భుతం. ఆ గ్రేస్ మరెవరికీ రాదు

ఆయనలో డ్యాన్స్ ఏ కాదు.. తెలియని ఎనర్జీ కూడా ఉంటుంది.: అవికా గోర్
X

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులకు ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో పరిచయమైన అవికా గోర్, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్న అవికా, ప్రస్తుతం విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పట్ల తనకున్న అభిమానాన్ని ఆమె బయటపెట్టింది. బన్నీ స్టైల్, ఆయన ఎనర్జీ అంటే తనకు ఎంతో ఇష్టమని మనసులో మాట బయటపెట్టింది. "అల్లు అర్జున్ గారు తనను తాను తీర్చిదిద్దుకునే విధానం నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా ఆయన డాన్స్ చేసే తీరు అద్భుతం. ఆ గ్రేస్ మరెవరికీ రాదు" అని ప్రశంసలు కురిపించింది. కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితంలో కూడా అల్లు అర్జున్ ప్రవర్తించే తీరు తనను ఆకట్టుకుంటుందని అవికా తెలిపింది. "ఆయనలో ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. అది కేవలం వెండితెరపైనే కాదు, బయట కలిసినప్పుడు కూడా ఆయన నుంచి వచ్చే ఆ పాజిటివ్ వైబ్ నాకు చాలా ఇష్టం. సెల్ఫ్ మేడ్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శం" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవికా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఈ వ్యాఖ్యలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆ టైమ్‌లో మద్యానికి బానిసయ్యాను.. లైఫ్‌లోని డార్క్ షేడ్ గురించి ఓపెన్ అయిన జాన్వీ కపూర్

Next Story