ఆ టైమ్‌లో మద్యానికి బానిసయ్యాను.. లైఫ్‌లోని డార్క్ షేడ్ గురించి ఓపెన్ అయిన జాన్వీ కపూర్

by Pulgam srinivas |   (  Updated:2026-04-18 09:44:32  IST  )

జాన్వీ కపూర్ మాట్లాడుతూ... సరదా కోసం మద్యం తాగడం ప్రారంభించాను. తర్వాత నేను దానికి బానిసనయ్యాను. ఒక సమయంలో నా మీదే నాకే అసహ్యం వేసి పూర్తిగా మద్యానికి దూరమయ్యానని ఈ నటి చెప్పుకొచ్చింది.

ఆ టైమ్‌లో మద్యానికి బానిసయ్యాను.. లైఫ్‌లోని డార్క్ షేడ్ గురించి ఓపెన్ అయిన  జాన్వీ కపూర్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో అద్భుతమైన జోష్‌తో కెరీర్‌ను ముందుకు సాగిస్తున్న యువ నటీమణుల్లో జాన్వీ కపూర్ ఒకరు. తాజాగా ఈమె ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన డార్క్ షేడ్ గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. తాజాగా జాన్వి కపూర్ మాట్లాడుతూ, “మద్యానికి బానిసైన వారిని నేరస్తుల్లా చూడకండి. వారు కూడా అందరిలాంటి సాధారణ మనుషులే. మద్యానికి బానిస కావడం అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య మాత్రమే. కొంతమంది తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా మద్యానికి అలవాటు పడతారు.

ఆ తర్వాత అది పెరిగి వారికి బానిసత్వంగా మారుతుంది. అలాంటి వారిని దూరం పెడితే వారు ఆ అలవాటుకు మరింత దగ్గరవుతారు. అదే ప్రేమతో దగ్గరకు తీసుకుంటే వారు ఆ చెడు అలవాటుకు దూరమయ్యే అవకాశం ఉంటుంది” అని తెలిపారు. అలాగే, “నా జీవితంలో కూడా ఒకానొక సమయంలో మద్యం విలన్‌గా మారింది. మొదట సరదా కోసం మద్యం తాగడం ప్రారంభించాను. తర్వాత నేను దానికి బానిసనయ్యాను. ఉదయం లేవగానే మద్యం తాగే అలవాటు ఏర్పడింది. ఆ స్థాయికి నేను వెళ్లిపోయాను. ఆ సమయంలో నా మీదే నాకే అసహ్యం వేసింది. అనంతరం నేను పూర్తిగా మద్యానికి దూరమయ్యాను” అని జాన్వి తన జీవితంలోని ఒక కీలక విషయాన్ని వెల్లడించారు.

Next Story