ఆ స్టార్ హీరోతో నటించే అవకాశం రావడం ఎక్జైటింగ్‌గా ఉంది: నజ్రియా నజీత్

by Mallepaka Hamsa |

కొంతకాలం గ్యాప్‌ ఇచ్చిన మలయాళ బ్యూటీ నజ్రియా(Nazriya Nazim) మళ్లీ సినిమాలకు రీఎంట్రీ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ స్టార్ హీరోతో నటించే అవకాశం రావడం ఎక్జైటింగ్‌గా ఉంది: నజ్రియా నజీత్
X

దిశ, సినిమా: కొంతకాలం గ్యాప్‌ ఇచ్చిన మలయాళ బ్యూటీ నజ్రియా(Nazriya Nazim) మళ్లీ సినిమాలకు రీఎంట్రీ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోనుంది. ‘సూర్య-47’వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీతూ మాధవన్ (Jeethu Madhavan)దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైన ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అయినట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నజ్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘జితు మాధవన్ దర్శకత్వం వహించిన ‘Suriya-47’ కథాంశం చాలా ఆసక్తికరంగా, కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు ఒక అద్భుతమైన వినోదాన్ని పొందబోతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. పెద్ద స్టార్ అయిన సూర్య గారితో కలిసి పనిచేయడానికి ఎక్జైటింగ్‌గా ఉంది.

సూర్య సర్‌తో నటించే అవకాశం రావడం నిజంగా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన పని తీరు, డెడికేషన్‌ గురించి చాలా విన్నాను. ఇప్పుడు ఆయనతో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్క్రిప్ట్‌ చాలా నచ్చింది. పాత్రలో పర్‌ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉంది. నా పాత్రకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, స్క్రిప్ట్‌ పాయింట్లపై కష్టపడుతున్నాను. దర్శకుడు కూడా నన్ను చాలా గైడ్‌ చేస్తున్నారు. ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది. ఆడియన్స్‌ ఎప్పట్లాగే నన్ను ప్రేమిస్తారని నమ్ముతున్నా. ఈ కథలో ఎమోషన్, ఫన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా ఉంది’’ అని చెప్పింది. అయితే ఇందులో నజ్రియా హీరోయిన్‌గా నటించనుందా? లేదా కీలక పాత్రలో కనిపించనుందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story