Hrithik Roshan: గుడ్ బై చెప్పడం కాస్త బాధగానే ఉంది.. హృతిక్ రోషన్ ఎమోషనల్ ట్వీట్.. దేని గురించంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-08 14:43:00  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘వార్-2’.

Hrithik Roshan: గుడ్ బై చెప్పడం కాస్త బాధగానే ఉంది.. హృతిక్ రోషన్ ఎమోషనల్ ట్వీట్.. దేని గురించంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘వార్-2’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, ‘వార్-2’(War-2) సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది.

ఈ విషయాన్ని తెలుపుతూ హృతిక్ రోషన్ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. ‘‘వార్-2 షూటింగ్ కంప్లీట్ అయిన నాకు ఏదో తెలియని భావన కలిగింది. అయితే 149 రోజుల విరామం లేని పోరాటం, యాక్షన్ డ్యాన్స్, చెమట, రక్తం, గాయాలు.. ఇవన్నీ విలువైనవే. తారక్ సర్ మీతో కలిసి పనిచేయడం ఇంత ప్రత్యేకమైన చిత్రాన్ని చేయడం చాలా గౌరవంగా ఉంది. కియారా అద్వానీ(Kiara Advani), మీలోని ఆ డేంజరస్ సైడ్ చూసేందుకు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా ఉంది.

అది అయాన్ల, అద్భుతమైన సినిమాటిక్ విజన్‌ను మీరంతా చూసేందుకు నేను వేచి ఉండలేను. ‘వార్-2’ టీమ్‌కు నటీనటులకు, సిబ్బందికి.. మీ టాలెండ్‌ను పంచుకున్నందుకు ప్రతిరోజు పని చేసినందుకు థాంక్స్. చివరగా కబీర్ పాత్రకు గుడ్ బై చెప్పడం కాస్త బాధగానే ఉంది. మళ్లీ నార్మల్ అవ్వడానికి నాకు కొన్ని రోజుల సమయం పడుతుంది. ఆగస్టు 14, 2025న వార్-2 మీ ముందుకు తీసుకురాబోతున్నాం’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా టీమ్ తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

link


Read More..

60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో .. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

స్విమ్ వేర్ లో డోస్ పెంచిన హాట్ బ్యూటీ... ఈ ఫోటోలు చూస్తే!

Next Story