- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ సినిమాలో ముందెన్నడూ చూడని అనుభూతి .. ‘ధురంధర్-2’ మూవీకి కోహ్లీ ఫిదా
ధురంధర్-2 నాకు ఒక అద్భుతమైన సినీ అనుభూతిని ఇచ్చింది. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి ఎక్స్ పీరియన్స్ నేను ముందెన్నడూ చూడలేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ధురంధర్-2' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా, ఇప్పుడు వసూళ్ల సునామీని తెస్తోంది. రికార్డులన్నీ తిరగరాస్తూ దూసుకుపోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై తాజాగా టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన తర్వాత కోహ్లీ తన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "ధురంధర్-2 నాకు ఒక అద్భుతమైన సినీ అనుభూతిని ఇచ్చింది. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి ఎక్స్ పీరియన్స్ నేను ముందెన్నడూ చూడలేదు. మూవీ దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, ఒక్క క్షణం కూడా దృష్టి మళ్లలేదు. అంతలా నన్ను కట్టిపడేసింది. ప్రతి ఎమోషన్‌ను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు" అంటూ కోహ్లీ కొనియాడారు.
దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను చూసి కోహ్లీ ఫిదా అయిపోయారు. ఆయన్ని ఒక ‘జీనియస్’ అని అభివర్ణించారు. ఇక రణ్‌వీర్ సింగ్ నటన గురించి చెబుతూ.. "సినిమాలోని నటీనటులందరూ బాగా చేశారు, కానీ రణ్‌వీర్ మాత్రం మరో స్థాయికి వెళ్ళిపోయాడు. అతని పర్ఫార్మెన్స్ అద్భుతానికి అతీతం.. అబ్సల్యూట్లీ వావ్!" అంటూ ఆకాశానికెత్తేశారు. కోహ్లీ చేసిన పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. "నీలాంటి ఒక లెజెండ్ నుండి ఇలాంటి మాటలు రావడం మాకు దక్కిన అతిపెద్ద గౌరవం. నీ అండర్-19 రోజుల నుండి నీ ఆటను ఫాలో అవుతున్నాను. దేశం కోసం నువ్వు ఆడే తీరు మా అందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. మా సినిమాల ద్వారా భారతదేశం గర్వపడేలా చేయడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాం" అని అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం కోహ్లీ కామెంట్స్, ఆదిత్య ధర్ రిప్లై సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.






