'Pushpa: The Rule - Part 2' రిలీజ్ పై క్లారిటీ ఇదే !

by Disha Web Desk 6 |
Pushpa: The Rule - Part 2 రిలీజ్ పై  క్లారిటీ ఇదే !
X

దిశ,సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. ఈ పాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో 'పుష్ప 2' మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ కూడా ఇందుకోసం భారీగా కసరత్తులు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బన్నీ కొంచెం లుక్ చేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ టైం మాస్ లుక్ లో గడ్డంతో కనిపించిన పుష్ప రాజ్.. ఇప్పుడు కాస్త గడ్డం తగ్గించి కనిపించనున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మూవీ రిలీజ్ పై లేటెస్ట్ గా ఓ అప్ డేట్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 'పుష్ప 2' విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ అక్టోబరు నుంచి మొదలు కానుంది.

ALSO READ : శ్రీను వైట్ల తో రవి తేజ సినిమా.!


Next Story

Most Viewed