శ్రీను వైట్ల తో రవి తేజ సినిమా.!

by Disha Web Desk 16 |
శ్రీను వైట్ల తో రవి తేజ సినిమా.!
X

దిశ,వెబ్‌డెస్క్: దర్శకుడు శ్రీను వైట్ల సినిమాలు టాలీవుడ్ లో వెండితెరపై ఆడక చాలా కాలం అవుతుంది. ఈ దర్శకుడి చివరి సినిమా రామ్ చరణ్ తో తీసిన బ్రూస్ లీ. ఇది వరకు ఢీ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ గా మంచు విష్టుతో (డీ డీ ) డబుల్ డోస్ సినిమా రాబోతుందని ప్రకటించారు. కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో శ్రీను వైట్ల స్టార్ హీరోలతో సినిమా తీయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల హీరో రవితేజకు కథ కూడా చెప్పారట. రవితేజ కూడా కథ నచ్చిందని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మరో సారి వీరిద్దరి కలయికతో త్వరలో సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్ట్ లతో రవి తేజ బిజీగా ఉన్నారు. ఈ రెండింటి తర్వాత శ్రీను వైట్ల సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

ALSO READ : 'పుష్ప 2' రిలీజ్ పై క్లారిటీ ఇదే !



Next Story

Most Viewed