హీరోయిన్లకు ఇలాంటి పాత్ర దొరకడం అరుదు.. నా కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది: అనన్య నాగళ్ల

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-14 04:21:15  IST  )

‘లీసా’ కథ విన్నప్పుడు అందులోని తన క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా అనిపించిందని, ఇలాంటి పాత్ర తాను ఇప్పటివరకు చేయలేదని అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని వెల్లడించింది.

హీరోయిన్లకు ఇలాంటి పాత్ర దొరకడం అరుదు.. నా కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది: అనన్య నాగళ్ల
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనన్య నాగళ్ల ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లీసా’. జవహార్ లాల్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనన్య సినిమా గురించి, తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అనన్య మాట్లాడుతూ.. తాను ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు కథలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది, నటిగా తాను కొత్తగా ఏం చేయగలనో ఆలోచిస్తానని తెలిపింది. ‘లీసా’ కథ విన్నప్పుడు అందులోని తన క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా అనిపించిందని, ఇలాంటి పాత్ర తాను ఇప్పటివరకు చేయలేదని అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని వెల్లడించింది. హీరోయిన్లకు పర్ఫార్మెన్స్ పరంగా ఇన్ని షేడ్స్ ఉన్న పాత్రలు దొరకడం చాలా అరుదని ఆమె అభిప్రాయపడింది.

ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ పడుతున్న కష్టాన్ని కూడా అనన్య గుర్తుచేసుకుంది. దర్శకుడు జవహార్ లాల్ రాజు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించేందుకు చాలా కష్టపడ్డారని, ఉదయం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయని తెలిపింది. అలాగే ఈ సినిమా విజువల్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి అందించిన విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయని, తను నటించిన ఏ సినిమాకు కూడా విజువల్స్ విషయంలో ఇంతగా ఎగ్జైట్ కాలేదని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. సతీష్ రెడ్డి షూట్ చేసిన కొన్ని సీన్స్ చూస్తుంటే.. నటిగా ఇంకా బాగా చేయాలనే స్ఫూర్తి తనకు కలిగిందని అనన్య కొనియాడింది. మొత్తానికి ‘లీసా’ తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐలా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అనన్య నాగళ్ల కెరీర్‌లో ఈ ‘లీసా’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

నాకు ఒంటరిగానే సంతోషంగా ఉంది.. పెళ్లిపై రామ్ షాకింగ్ కామెంట్స్

Next Story