నాకు ఒంటరిగానే సంతోషంగా ఉంది.. పెళ్లిపై రామ్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-14 04:21:49  IST  )

ఖాళీ సమయం దొరికితే నాతో నేను గడపడానికి ఇష్టపడతాను. అది నాకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.

నాకు ఒంటరిగానే సంతోషంగా ఉంది.. పెళ్లిపై రామ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గతేడాది ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసినా, ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం రామ్ తన తదుపరి ప్రాజెక్టుల కోసం కథలు వింటూ కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. అయితే, సినిమాల కంటే ఎక్కువగా ఇప్పుడు రామ్ వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా ఆయన పెళ్లి ,ఒంటరితనం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, రామ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, తను ఒంటరిగా ఉండటాన్ని ఎంతగా ఇష్టపడతారో వివరించారు. సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఎప్పుడూ పదుల సంఖ్యలో మనుషుల మధ్య, షూటింగ్ హడావుడిలో ఉంటారు. కానీ రామ్ మాత్రం తన ఏకాంతాన్ని అమితంగా ప్రేమిస్తారట. "నేను చిన్నప్పటి నుంచే ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డాను. ఖాళీ సమయం దొరికితే నాతో నేను గడపడానికి ఇష్టపడతాను. అది నాకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది" అని రామ్ చెప్పుకొచ్చారు. చాలా మంది ఒంటరితనాన్ని బాధగా భావిస్తారు, కానీ రామ్ మాత్రం దాన్ని ఒక వరంలా చూస్తున్నారు.

స్నేహితులతో గడపడం, బయటకు వెళ్లడం ఇష్టమే అయినా, తనకంటూ కేటాయించుకునే ఆ సమయం ఇచ్చే కిక్కు వేరని ఆయన అంటున్నారు. "సినిమా రంగంలో ఉన్నప్పుడు వందల మంది మధ్య ఉండటం తప్పదు. కానీ ఆ రద్దీలో కూడా నాకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నాను" అని ఆయన అన్నారు. ఇక అందరూ ఎదురుచూస్తున్న పెళ్లి విషయంపై కూడా రామ్ పరోక్షంగా స్పందించారు. తన జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయాన్ని పంచుకోవడానికి తను సిద్ధంగానే ఉన్నానని, ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగానే సంతోషంగా జీవించగలనని స్పష్టం చేశారు. ఇది కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, అది కేవలం తన సహజసిద్ధమైన వ్యక్తిత్వం మాత్రమేనని ఆయన వివరించారు. రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. చాలా మంది నెటిజన్లు ఆయన మాటలకు మద్దతు తెలుపుతున్నారు. "లైఫ్ అంటే మనకు నచ్చినట్లు ఉండటమే కదా" అని కొందరు అంటుంటే, రామ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? లేదా అని మరికొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హీరోయిన్లకు ఇలాంటి పాత్ర దొరకడం అరుదు.. నా కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది: అనన్య నాగళ్ల

Next Story