Nabha Natesh :: సింపుల్ లుక్స్‌లో అదరగొట్టిన ఇస్మార్ట్ బ్యూటీ

by Disha Web Desk 10 |
Nabha Natesh :: సింపుల్ లుక్స్‌లో అదరగొట్టిన  ఇస్మార్ట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల తార నభా నటేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది.

2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో రామ్ కు జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తెలంగాణ భాషలో మాట్లాడుతుంటే థియేటర్లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు. నిజం చెప్పాలంటే నభా మాట్లాడి మాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ ఒక్క సినిమాతో ఆమె సినీ కెరీర్ మలుపు తిరిగింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ తర్వాత రవితేజ సరసన డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ సరసన సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, నితిన్ సరసన మేస్ట్రో వంటి తెలుగు ల్లో నటించినా పెద్దగా ఫలితం రాలేదు. సినిమాలను ఎంచుకోవడంలో తడబడిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఒక్క హిట్ ను కూడా అందుకోలేక పోయింది. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ ..సోషల్ మీడియాలో ఆమె అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజా సోషల్‌ మీడియాలో తన ఫోటోలతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ సింపుల్ లుక్స్‌లో క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, కన్నడ సినిమాలు ఇవే


Next Story

Most Viewed