ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ మెయిన్ టైటిల్ ఇదేనా?

by Disha Web Desk 4 |
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ మెయిన్ టైటిల్ ఇదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’తో త్వరలో మన ముందుకు రానున్నారు. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. కమల్ హసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ‘ప్రాజెక్ట్ K’ మెయిన్ టైటిల్‌కు సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కాలచక్ర’ అని, గతం, భవిష్యత్తుకి సంబంధించిన కాన్సెప్ట్ బేస్ట్‌గా కావడంతో ఈ సినిమాకు ‘ప్రాజెక్ట్ కాలచక్ర’ అని టైటిల్ పెట్టినట్లు తెలిసింది. కాగా జూలై 20న ‘శాన్ డియాగో కామిక్ కాన్ 2023’ వేడుకలో టైటిల్‌తో పాటు ట్రైలర్‌ను మూవీ టీం విడుదల చేయనుంది. మరో పది రోజుల్లో ఈ మూవీ టైటిల్ విషయంలో క్లారిటీ రానుంది.

Also Read: ఈ వారం థియేటర్, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

Next Story

Most Viewed