ఆ విషయంలో సామ్, చైతూకి గొడవ.. వారిద్దరూ విడిపోవడానికి ఆమే కారణమా?

by Dishanational2 |
ఆ విషయంలో సామ్, చైతూకి గొడవ.. వారిద్దరూ విడిపోవడానికి ఆమే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత నాగచైతన్య విడిపోయి దాదాపు సంవత్సరం కావస్తోన్నా.. వీరి గురించి గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతూనే ఉంటుంది.

తాజాగా సామ్, చై విడిపోవడానికి గల కారణం నాగర్జున మేనకోడలు సుప్రియనే అంటూ మరో పుకారు నెట్టింట్లో షికారు చేస్తోంది. అయితే సుప్రియ, నాగచైతన్య మేన మామ కొడుకు కావడంతో, చాలా సన్నిహితంగా మెదిలేది. అంతే కాకుండా ప్రతి ఇష్యూ తనతో షేర్ చేసుకునేదంట. అయితే అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియ, హీరో అడవి శేషుతో లవ్‌లో ఉందంటూ, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వారికి పెళ్లికి చై సపోర్ట్ చేశాడంట. కానీ దానికి సమంత అడ్డు పడేదంట, అంతే కాకుండా సుప్రియ, చై క్లోస్‌గా ఉంటే సమంతకు నచ్చేది కాదంట. అడవి శేషుతో సుప్రియ పెళ్లికి సమంత అడ్డుపడిన విషయంలోనే చైకి, సామ్ కి మధ్య గ్యాప్ వచ్చిందని, అదే విడాకుల వరకు దారితీసిందంటూ మరో గాసిప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Also Read: ఆ ఎన్నికల్లో బండ్ల గణేష్ పోటీ.. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన


Next Story