ఆ ఎన్నికల్లో బండ్ల గణేష్ పోటీ.. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన

by Disha Web Desk 6 |
ఆ ఎన్నికల్లో బండ్ల గణేష్ పోటీ.. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు పరిచయం అవసరం లేదు. గతంలో సినిమాలు నిర్మిస్తూనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, కొన్ని రోజులుగా ఏదో కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తున్నారు. ఇక తాజాగా, బండ్ల గణేష్ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో బిజీ కావటానికి ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది.

అయితే ఆయ‌న త్వర‌లోనే హైద‌రాబాద్‌లోని ఎఫ్ఎన్‌సీసీ ఎన్నిక‌ల్లో పాల్గొన‌బోతున్నారు. ఈ విష‌యాన్ని స్వయంగా బండ్ల గణేష్ తెలియ‌జేస్తూ ట్వీట్ చేశాడు. ''మీ చేతుల్లో మార్చే శ‌క్తి, అవ‌కాశం ఉంది. 'ఎఫ్ఎన్‌సీసీ' ఎన్నిక‌ల్లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకే వేయండి' అంటూ బండ్ల గణేష్ రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఆ విషయంలో సామ్, చైతూకి గొడవ.. వారిద్దరూ విడిపోవడానికి ఆమే కారణమా?


Next Story

Most Viewed