అయ్యో పాపం.. నాగార్జున వల్లే చైతూ తన పెళ్లి జీవితాన్ని నాశనం చేసుకున్నాడా?

by Dishanational2 |
అయ్యో పాపం.. నాగార్జున వల్లే చైతూ తన పెళ్లి జీవితాన్ని నాశనం చేసుకున్నాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత వీరికి సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కలిసి నాలుగు సవత్సరాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు. దీంతో వీరు విడిపోవడానికి అసలు కారణం ఏమిటో తెలియక ఒక్కొక్కరు ఒక్కోరకమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు చైతూని తప్పు పడితే, మరికొందరు సమంతని తప్పు పట్టారు.

అయితే తాజాగా మరో న్యూస్ వైరల్‌గా మారింది. నాగాచైతన్య పెళ్లి జీవితం నాశనం కావడానికి కారణం నాగార్జుననే అంటూ చైతూ అభిమానులు తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే? చైతూ తన కాలేజ్ డేస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించాడంట. ఆ విషయాన్ని చాలా భయంగా నాగార్జునకు చెబితే, పెళ్లిలేదు ప్రేమ లేదు, నువ్వు స్టార్ హీరో అయిన తర్వాత పెళ్లి చేస్తానంటూ చెప్పుకొచ్చాడంట.

దీంతో చైతూ నాగార్జున మీద గౌరవంతో ఆ అమ్మాయిని మర్చిపోయాడు. తర్వాత సమంతతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరు పెళ్లైన నాలుగు సంవత్సరాలకే విడిపోయారు. అదే నాగార్జున అప్పుడే నాగచైతన్య లవ్ ను ఒప్పుకొని పెళ్లి చేస్తే చైతూ ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండే వాడు, ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో సెట్ కాలేక విడిపోయాడు, చైతూ పెళ్లి జీవితం నాశనం కావడానికి కారణం నాగార్జునే అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ప్లీజ్ నన్ను అలా చూడొద్దు: వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్

ఉమెన్స్ డే స్పెషల్.. సమంత అభిమానులకు గుడ్ న్యూస్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed