తండ్రి కాబోతున్న రానా.. మిహీకా బేబి బంప్‌ వీడియో వైరల్

by Disha Web Desk 10 |
తండ్రి కాబోతున్న రానా.. మిహీకా బేబి బంప్‌ వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 2020లో తాను ప్రేమించిన మిహీకా బజాజ్‌తో ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అయితే ఇప్పటికే చాలాసార్లు రానా తండ్రి కాబోతున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ ఈ జంట వాటిని కొట్టిపారేసింది. ఏదైనా ఉంటే తామే అభిమానులకు చెబుతామంటూ రూమర్స్‌కు చెక్ పెట్టారు. అప్పటినుంచి ఇలాంటి రూమర్స్ మళ్లీ వినపడలేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మిహీకా తాజాగా ఇన్‌స్టా‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియేలో బీచ్ ఒడ్డున ఒక లూజ్ ధరించి చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. అయితే ఈ వీడియోలో ఆమె బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు రానాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. దీనిపై ఆ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.

నెట్టింట కొత్తగా రికార్డు సృష్టించిన.. విజయ్ దేవరకొండ..

Next Story

Most Viewed