- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
38 ఏళ్ల వయసులో చార్మీ పెళ్లి చేసుకోబోతుందా..? అతడితో కలిసి ప్రత్యేక పూజలు
38 ఏళ్లు వచ్చినప్పటికీ చార్మీ కౌర్ (Charmy Kaur)ఇప్పటికీ సింగిల్‌గా ఉంటూ కెరీర్‌పైనే దృష్టి పెట్టింది.

దిశ, సినిమా: 38 ఏళ్లు వచ్చినప్పటికీ చార్మీ కౌర్ ఇప్పటికీ సింగిల్‌గా ఉంటూ కెరీర్‌పైనే దృష్టి పెట్టింది. నిర్మాతగా ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. ఈక్రమంలో.. తాజాగా, చార్మీ పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సడెన్‌గా ఈరోజు డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో అది కాస్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పసుపు రంగు దుస్తుల్లో ఎంతో సంప్రదాయంగా కనిపించిన చార్మీని చూసి, ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని, అందుకే ఈ ప్రత్యేక పూజలని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. గతంలో కూడా పూరీ-చార్మీల రిలేషన్‌షిప్‌పై పలు రూమర్లు వచ్చినప్పటికీ, వారు కేవలం ప్రొఫెషనల్ పార్ట్‌నర్స్ అని ప్రతిసారీ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. నిజానికి చార్మీ పూజలు చేసింది పెళ్లి కోసం కాదు, తన తదుపరి చిత్రం ‘స్లమ్ డాగ్’ సక్సెస్ కోసమని సమాచారం. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి వరుస పరాజయాలు పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి.
దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ‘స్లమ్ డాగ్’ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తరుణంలో, ఎటువంటి ఆటంకాలు కలగకూడదని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘33 టెంపుల్ రోడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టడం వెనుక ఒక పెద్ద సస్పెన్స్ ఉంది. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ వంటి ఉద్ధండులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబై మురికివాడల నేపథ్యంలో సాగే ఒక క్రైమ్ థ్రిల్లర్ కథతో పూరీ జగన్నాథ్ మళ్ళీ తన పాత మార్క్ మేకింగ్‌ను గుర్తుకు తెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. మల్టీస్టారర్ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో చార్మీ ప్రొడ్యూసర్‌గా మళ్ళీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. వరుసగా తగిలిన దెబ్బల నుంచి కోలుకోవాలంటే ‘స్లమ్ డాగ్’ విజయం చార్మీకి అత్యంత కీలకం అని చెప్పొచ్చు.






