హారర్ థ్రిల్లర్ ‘భూత్ బంగ్లా’ సినిమాలో యంగ్ బ్యూటీ ఫిక్స్.. పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-04 12:41:09  IST  )

అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘భూత్ బంగ్లా’ (Bhooth Bangla) లో వామికా గబ్బి.

హారర్ థ్రిల్లర్ ‘భూత్ బంగ్లా’ సినిమాలో యంగ్ బ్యూటీ ఫిక్స్.. పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), కామెడీ కింగ్ ప్రియదర్శన్(Priyadarshan) కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘భూత్ బంగ్లా’ (Bhooth Bangla). ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులోకి తాజాగా సౌత్ బ్యూటీ వామికా గబ్బి వచ్చి చేరింది. ఇందులో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వామికా, ఇప్పుడు అక్షయ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా సరదాగా ఉండటమే కాకుండా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘భూల్ భూలయ్యా’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

‘భూత్ బంగ్లా’లో కూడా అదే స్థాయి కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని టాక్. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు సీనియర్ నటి టబు, విద్యా బాలన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. పరేశ్ రావల్, రాజ్పాల్ యాదవ్, అశ్రానీ వంటి లెజెండరీ కమెడియన్లు ఉండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. జూన్ 15 కాకుండా, సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని మే 15, 2026న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని చారిత్రాత్మక కోటల్లో జరుగుతోంది. 'భూల్ భూలయ్యా' సినిమాను చిత్రీకరించిన ప్రాంతాల్లోనే దీనిని కూడా ప్లాన్ చేయడం ఒక విశేషం. ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. అక్షయ్ కుమార్ తన పాత రికార్డులను తిరగరాసేందుకు ఈ ‘భూత్ బంగ్లా’తో రాబోతున్నాడు.

Next Story