- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ బంధంపై ఆసక్తి పోతోంది.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్..
జీవితంలో ఒక తోడు ఉండటం, ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నారు అనే భావన మనసుకి ఎంతో అద్భుతంగా ఉంటుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ కుర్రకారు చిట్టి అని ప్రేమగా పిలుచుకునే ఆరడుగుల అందగత్తె ఫరియా అబ్దుల్లా, తన మొదటి సినిమా ‘జాతిరత్నాలు’తోనే ఓ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన సహజ సిద్ధమైన నటన, చలాకీతనంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ‘సిగ్మా’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి అనే బంధం పట్ల యువత మారుతున్న తీరుపై ఫరియా తన ఆందోళనను వ్యక్తం చేసింది. "జీవితంలో ఒక తోడు ఉండటం, ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నారు అనే భావన మనసుకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పెళ్లి వల్ల ఒక మనిషి తనను తాను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ ప్రస్తుత తరం పెళ్లిపై ఆసక్తిని కోల్పోతోంది.
రాబోయే కాలంలో ఈ బంధానికి అసలు అర్థమే మారిపోతుందేమో అనిపిస్తోంది" అని ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. పెళ్లి పట్ల తనకు సానుకూల దృక్పథమే ఉందని, అయితే ఇప్పటివరకు తన మనసుకి నచ్చిన సరైన వ్యక్తి దొరకలేదని వెల్లడించింది. అందుకే ప్రస్తుతానికి వివాహం గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవారన్న ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తనకు వంటలంటే ఇష్టమని, అందుకే ఏదైనా పెద్ద క్రూయిజ్ షిప్‌లో షెఫ్‌గా పనిచేసేదాన్నని లేదా ఈవెంట్ మేనేజర్‌గా స్థిరపడేదాన్నని తెలిపింది. ముక్కుసూటిగా మాట్లాడే ఈ ‘జాతిరత్నం’ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






