Mirnaa Menon :‘ఉగ్రం’లో ఛాలెజింగ్ రోల్ చేశాను

by Disha Web Desk 7 |
Mirnaa Menon :‘ఉగ్రం’లో ఛాలెజింగ్ రోల్ చేశాను
X

దిశ, సినిమా : అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబోలో వస్తున్న మూవీ ‘ఉగ్రం’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న చిత్ర కథానాయిక మిర్నా మీనన్.. తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు పంచుకుంది. ‘నేను దుబాయిలో ఇంజనీర్‌గా పని చేశాను. కానీ, చిన్నప్పటినుంచి నటిని కావాలనే కోరికతో ఇటువైపు అడుగులేశాను. రజినీకాంత్‌గారి ‘జైలర్’ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌లో ఉండగానే ‘ఉగ్రం’ దర్శకుడు నన్ను సంప్రదించారు. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాది ఛాలెంజింగ్ రోల్. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాను. ఇలాంటి పాత్ర చేయడం సవాలే. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను. నరేష్‌ గారితో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. సినిమా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ అవకాశం కల్పించిన మూవీ టీమ్ అందరికీ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది.

Read more:

రోజుకు 130 సిగరెట్లు తాగిన టాలీవుడ్ హీరో.. 4 రోజులకే ఆస్పత్రి బెడ్‌పై ఆ స్థితిలో.

Next Story