రోజుకు 130 సిగరెట్లు తాగిన టాలీవుడ్ హీరో.. 4 రోజులకే ఆస్పత్రి బెడ్‌పై ఆ స్థితిలో..

by Disha Web Desk 7 |
రోజుకు 130 సిగరెట్లు తాగిన టాలీవుడ్ హీరో.. 4 రోజులకే ఆస్పత్రి బెడ్‌పై ఆ స్థితిలో..
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లరి నరేష్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కామెడీ సినిమాలు చేస్తూ.. ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అల్లరి నరేష్ కాస్త సీరియస్ యాక్షన్ ‌లోకి దిగిపోయాడు. కంటెంట్ ప్రాధాన్యతపై ఫోకస్ పెట్టి హిట్స్ అందుకుంటున్నాడు. నాంది సినిమాల్లో అల్లరి నరేష్ సీరియస్ యాక్షన్ ఎంత మంచి హిట్ అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ క్రమంలోనే ఇప్పుడు మరో యాక్షన్ మూవీతో ముందుకొచ్చేస్తున్నాడు అల్లిరి నరేష్. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వలో రాబోతున్న సినిమా ‘ఉగ్రం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, ట్రీజర్ మూవీపై అంచనాలను భారీ స్థాయిల్లో పెంచేస్తున్నాయి. మే 5 రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న క్రమంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ ఈ చిత్రం కోసం తను ఎంత కష్ట పడ్డారో చెప్పుకొచ్చారు.

ఈ మూవీ కోసం కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపుగా ఐదారువందలు సిగరెట్స్ తాగడంతో ఆరోగ్యం దెబ్బతిందని తెలిపారు. “అడవిలో ఓ ఫైట్ సీన్‌లో ఒక వైపు దట్టంగా పొగ వచ్చేలా స్మోక్ మిషన్స్ పెట్టారు. మరోవైపు నన్ను సిగరెట్ తాగుతూ రమ్మంటారు. ఇలా దాదాపు నాలుగు రోజుల్లో ఐదారువందలు సిగరెట్స్ తాగాను. దీంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతింది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లరి నరేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read..

‘ఉగ్రం’లో ఛాలెజింగ్ రోల్ చేశాను: మిర్నా మీనన్

మా అమ్మ వల్లే.. నేను ఇలా తయారయ్యాను: మసాబా గుప్తా


Next Story

Most Viewed