ఫ్లాప్ డైరెక్టర్‌తో కనిపించి షాకిచ్చిన అల్లు అర్జున్.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 03:02:09  IST  )

‘పుష్ప–2’తో అల్లు అర్జున్ (Allu Arjun)స్థాయి పూర్తిగా మారిపోయింది. ఐకాన్ స్టార్‌గా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ గుర్తింపు సంపాదించాడు.

ఫ్లాప్ డైరెక్టర్‌తో కనిపించి షాకిచ్చిన అల్లు అర్జున్.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ‘పుష్ప–2’తో అల్లు అర్జున్ (Allu Arjun)స్థాయి పూర్తిగా మారిపోయింది. ఐకాన్ స్టార్‌గా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ గుర్తింపు సంపాదించాడు. ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ (Atlee)దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘AA–24’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుందని సమాచారం. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ అల్లు అర్జున్ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇటీవల ‘అల్లు సినిమాస్’ పేరుతో నిర్మించిన భారీ మల్టీప్లెక్స్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా తన తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్‌తో పాటు మామయ్య చిరంజీవి ఫొటోలను అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం విశేషం. సంక్రాంతి సినిమాలతో ‘అల్లు సినిమాస్’ లాంఛనంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఓ ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ‘కింగ్‌డమ్’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri)తో ఓ ప్రాజెక్ట్ ఉంటుందనే ప్రచారం సాగింది. దీంతో అది తెలుసుకున్న వారంతా షక్ అవుతున్నారు. అయితే దీనిపై అల్లు అర్జున్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. అది సినిమా కాదని, ‘అల్లు సినిమాస్’ ప్రచారానికి సంబంధించిన యాడ్ షూట్స్ మాత్రమేనని వెల్లడించాడు. ఈ యాడ్స్‌కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపాడు.

ఈ విషయానికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఆ పోస్ట్‌కు ఆయన ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. ‘‘అల్లు సినిమాస్ కోసం ఒక ప్రచార ప్రకటన నిమిత్తం గౌతమ్‌తో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది. అతని విజన్, పనిపై ఉన్న నిజాయితీ నిజంగా అభినందనీయం. ప్రేమతో, ఆప్యాయతతో ఈ పనిని చేసినందుకు ధన్యవాదాలు. మేము రూపొందించినదాన్ని అందరూ చూడబోతుండటంపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’’ అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

link

Read More..

ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోను.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్

Next Story