- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజం కోసం పెళ్లి చేసుకోను.. ఒంటరిగా ఉండటమే మేలు.. త్రిష షాకింగ్ కామెంట్స్
నేను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నానంటే అది జీవితాంతం కలిసి ఉండటానికే కావాలి.

దిశ, సినిమా: టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష (Trisha)వయసు పెరుగుతున్నా కొద్దీ తన గ్లామర్‌తో, నటనతో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతోంది. 42 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా, తన మనసులో ఉన్న అసలు భయాన్ని బయటపెట్టింది. చాలామంది తనను పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారని, కానీ ఆ ప్రశ్నకు తన దగ్గర ఇప్పటికీ సరైన సమాధానం లేదని త్రిష స్పష్టం చేసింది. ‘‘కేవలం సమాజం కోసమో లేదా వయసు అయిపోతుందనే భయం తోనో నేను పెళ్లి చేసుకోను. నాకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి. నాకు నచ్చిన, నన్ను అర్థం చేసుకునే సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి పీటలు ఎక్కుతాను.
ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే, జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా నేను సిద్ధమే’’ అని త్రిష కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. త్రిష పెళ్లికి దూరంగా ఉండటానికి ప్రధాన కారణం విడాకులు అనే భయం అని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. ‘‘నేను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నానంటే అది జీవితాంతం కలిసి ఉండటానికే కావాలి. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోను’’ అని స్పష్టం చేసింది. పెళ్లి అనేది సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాకూడదని, జీవితాంతం కలిసి ఉండగలమని నమ్మకం కలిగినప్పుడే ఆ అడుగు వేయాలని అభిప్రాయపడ్డారు. అలాగే తాను ఎంతోమంది పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతున్న వారిని చూశానని వెల్లడించింది.
‘‘నా స్నేహితుల్లో చాలామంది ఇష్టం లేకపోయినా కేవలం పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకొని, ఇప్పుడు బలవంతంగా జీవితాలను కొనసాగిస్తున్నారు. అలాంటి నరకాన్ని నేను అనుభవించలేను. ఇష్టం లేని వ్యక్తితో కలిసి బతకడం కంటే ఒంటరిగా ఉండటమే మేలు’’ అని ఆమె ధీమాగా చెప్పింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, త్రిష ప్రేమలో పడాలని అనుకోవడం లేదట. ‘‘నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి. నా ఆలోచనలను పంచుకునే వాడు, నన్ను గౌరవించే వాడు దొరికితే తప్పకుండా నా జీవితాన్ని అతనితో పంచుకుంటాను’’ అని తన మనసులోని మాటను బయటపెట్టింది. మొత్తానికి త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి విషయంలో ఆమెకున్న క్లారిటీని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జీవితాంతం బాధపడేకంటే, సరైన వ్యక్తి కోసం వేచి ఉండటమే మంచిది అంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.






