- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. నేను ఎప్పుడూ ఏ భాషనూ చిన్నచూపు చూడను: సాయి పల్లవి
నేను ఎప్పుడూ ఏ భాషను చిన్నచూపు చూడలేదు. నా మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పాను. అది నా పుట్టుక గురించి ఇచ్చిన క్లారిటీ మాత్రమే కానీ, ఏ భాష మీదో నాకు ద్వేషం లేదు.

దిశ, సినిమా: సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి, తన అద్భుతమైన నటనతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ‘రామాయణ’లో సీతగా నటిస్తూ బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్న ఈమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గురించి జరిగిన ఒక తప్పుడు ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఒక ప్రెస్ మీట్‌లో తాను చెప్పిన మాటలను మీడియా వక్రీకరించడం తనను ఎంతగానో బాధించిందని ఆమె పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో, "మలయాళ నటీనటులు తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడగలరు?" అని ఒక రిపోర్టర్ అడిగారు. దానికి సాయిపల్లవి చాలా నిజాయితీగా, "నేను మలయాళీని కాను, తమిళ అమ్మాయిని" అని మాత్రమే చెప్పారట. అయితే, రెండేళ్ల తర్వాత ఒక పత్రికలో "తనను మలయాళీ అని పిలిచినందుకు సాయిపల్లవికి కోపం వచ్చింది" అని హెడ్‌లైన్ వేయడం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. దీనివల్ల ఆమె మలయాళ భాషను ద్వేషిస్తుందనే ఒక తప్పుడు ముద్ర పడిందని అది తనను చాలా భాదపెట్టిందని అన్నారు.
ఈ విషయాన్ని వివరిస్తూ సాSai Pallaviయిపల్లవి ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ ఆమెతో మలయాళంలో మాట్లాడటానికి సంకోచిస్తూ, "మీకు కోపం వస్తుందేమో" అని అడగడం ఆమెను కలచివేసింది. "నేను ఎప్పుడూ ఏ భాషను చిన్నచూపు చూడలేదు. నా మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పాను. అది నా పుట్టుక గురించి ఇచ్చిన క్లారిటీ మాత్రమే కానీ, ఏ భాష మీదో నాకు ద్వేషం లేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు" అని సాయిపల్లవి స్పష్టం చేశారు. కోయంబత్తూరులో పెరిగిన తాను అన్ని భాషలను గౌరవిస్తానని, తన మాటలను వక్రీకరించడం వల్ల సాధారణ ప్రజల్లో తన పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పడటం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.సెలబ్రిటీల గురించి వచ్చే వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోకుండా ప్రచారం చేయడం వల్ల వారి వ్యక్తిగత ఇమేజ్ ఎలా దెబ్బతింటుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అని చెప్పుకొచ్చింది.






