'LIK' సెట్స్‌లో కృతి శెట్టి ఫన్నీ మూమెంట్స్!

by velandi.Saikiran |   (  Updated:2026-04-21 08:59:14  IST  )

రోబో లాగా నడిచిన కృతి శెట్టి, ఆ తర్వాత డిఫరెంట్ స్టెప్పులు వేస్తూ అలరించింది.

LIK సెట్స్‌లో కృతి శెట్టి ఫన్నీ మూమెంట్స్!
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. పెద్ద హిట్స్ లేకపోయినా స్టార్ హీరోల సరసన నటించి అందరిని మెప్పించింది. అలాంటి కృతి శెట్టికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. రోబో లాగా నడిచిన కృతి శెట్టి, ఆ తర్వాత డిఫరెంట్ స్టెప్పులు వేస్తూ అలరించింది. ఈ సంఘటన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ షూటింగ్ సెట్స్ లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.

ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళ్తోంది. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే రూ.54 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే సినిమాకు మరింత ప్రమోషన్ చేయాలన్న లక్ష్యంతో, తాజాగా కృతి శెట్టి వీడియోలు చిత్ర బృందమే వదిలినట్లు చెబుతున్నారు. మూవీ షూటింగ్ సమయంలో ఆమె చేసిన అల్లరి పనిని ఇప్పుడు వైరల్ చేసి, సినిమాకు హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ ఫన్నీ వీడియో వైరల్ గా మారింది.

నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. నేను ఎప్పుడూ ఏ భాషనూ చిన్నచూపు చూడను: సాయి పల్లవి

Next Story