గ్లామర్ కాదు.. సవాళ్లతో కూడిన పాత్రలు, బలమైన కథలే ముఖ్యమంటున్న సెన్సేషనల్ బ్యూటీ

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-14 09:20:50  IST  )

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది సారా అర్జున్(Sara Arjun).

గ్లామర్ కాదు.. సవాళ్లతో కూడిన పాత్రలు, బలమైన కథలే ముఖ్యమంటున్న సెన్సేషనల్ బ్యూటీ
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది సారా అర్జున్(Sara Arjun). ఇక ఇటీవల ‘ధురంధర్’(Dhurandhar)సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయి.. సెన్సేషనల్ బ్యూటీగా మారింది. హీరోయిన్‌గా చేసిన తన మొదటి మూవీనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు పలు సంచలన రికార్డులు క్రియేట్ చేయడంతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఊహించని పాపులారిటీ దక్కడంతో పాటుగా.. వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా అర్జున్ తనకు గ్లామర్ పాత్రలకంటే.. సవాళ్లతో కూడిన పాత్రలకే తాను ప్రాధాన్యత ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ‘‘నటిగా గ్లామర్ కాదు.. సవాళ్లతో కూడిన పాత్రలు, బలమైన కథలే ముఖ్యం.

కేవలం నటించడమే కాకుండా, మెరుగుపరుచుకుంటూ ఒక కళాకారిణిగా ఎదిగేందుకు అవకాశం ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తాను. అందుకే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ, సమాజంలో చర్చలు రేకెత్తించే అంశాలు ఉన్న ‘యుఫోరియా’ , ‘మ్యాజిక్’ (Magic) వంటి చిత్రాలను ఎంచుకున్నా. నిజానికి ‘ధురంధర్’ కంటే ముందే నేను యుఫోరియాకు సంతకం చేశాను. కేవలం నటిగానే కాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఈ కథలను జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ప్రస్తుత యువతకు ఇలాంటి కథలు చాలా అవసరమని బలంగా నమ్ముతున్నాను. ఈ చిత్రాల ద్వారా సమాజంలో మార్పు రావాలని, యువతలో ఆలోచనలు మొదలవ్వాలని అనుకుంటున్నా.

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘యుఫోరియా’ చిత్రంలోని కథాంశం నన్ను అమితంగా ఆకట్టుకుంది. అందుకే ఉన్నత చదువుల కంటే ముందే ఈ సినిమా చేయడానికి అంగీకరించా. గుణశేఖర్ వంటి గౌరవనీయమైన దర్శకుడి పర్యవేక్షణలో పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ‘యుఫోరియా’ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, సమాజంలో చర్చ జరగాల్సిన ముఖ్యమైన సామాజిక అంశాలను స్పృశిస్తుంది. ఈ చిత్రం సమాజానికి ఒక అర్ధవంతమైన సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులు సామాజిక సమస్యలపై ఆలోచించేలా చేస్తుంది. ఒక నటిగా నాకు సవాలు విసిరే పాత్రలను చేయడమే నా మొదటి ప్రాధాన్యత’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సారాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

READ MORE ....

నేను రూ.400 బట్టలు వేసుకుంటాను.. బిగ్ బాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story