నేను రూ.400 బట్టలు వేసుకుంటాను.. బిగ్ బాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-01-14 09:22:22  IST  )

బుల్లితెర ప్రేక్షకులకు శ్రీసత్య (Sri Satya)ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ చిన్నది అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.

నేను రూ.400 బట్టలు వేసుకుంటాను.. బిగ్ బాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర ప్రేక్షకులకు శ్రీసత్య (Sri Satya)ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ముద్దమందారం’(Mudda mandaram), ‘త్రినయని’(Trinayani), ‘నిన్నే పెళ్లాడతా’(Ninne Pelladatha) వంటి హిట్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 (Bigg Boss Telugu Season 6) ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్స్, డాన్స్ ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉన్నది.

అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ చిన్నది అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. శ్రీ సత్య మాట్లాడుతూ.. ‘ నేను బట్టలకు ఎక్కువగా ఖర్చు చేయను. కానీ తిండికి చేస్తాను. నేను చెప్తే నమ్మరు కానీ నేను వేసుకునే బట్టలు రూ.400లో మీషో యాప్‌లో బుక్ చేసుకుంటాను. ఒక్కోక్కరు వేలల్లో పెడతారు డ్రెస్సింగ్ కోసం అసలు అంత మనీ ఎలా పెడతారు అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే నేను వేసుకునే తక్కువ రేటు బట్టలు కూడా నాకు చాలా అందాన్ని తీసుకొస్తాయి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

READ MORE ....

గ్లామర్ కాదు.. సవాళ్లతో కూడిన పాత్రలు, బలమైన కథలే ముఖ్యమంటున్న సెన్సేషనల్ బ్యూటీ


Next Story