ఆయన నాకు ఫోన్ చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు: సన్నీ లియోన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-14 04:48:46  IST  )

ఆ ఫోన్ రాగానే నాకు చాలా భయం వేసింది. ఎంతో కంగారు పడ్డాను.

ఆయన నాకు ఫోన్ చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు: సన్నీ లియోన్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా సెన్సేషనల్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny Leone), విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెన్నడీ’ (Kennedy). కాన్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న క్రైమ్ థ్రిల్లర్, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది. రాహుల్ భట్ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా, కాంట్రాక్ట్ కిల్లర్‌గా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20, 2026న ZEE5 వేదికగా విడుదల కానుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ లియోన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని, తనపై చిత్ర పరిశ్రమలో ఉన్న అభిప్రాయాన్ని మారుస్తుందని సన్నీ లియోన్ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ‘కెన్నెడీ’ చిత్రంలో ఆమె చార్లీ అనే రహస్యమైన పాత్రలో కనిపించనుంది.

చాలా భయం వేసింది..

ఈ సినిమా గురించి సన్నీ మాట్లాడుతూ.. ‘‘అనురాగ్ కశ్యప్ నాకు ఫోన్ చేసి ఆడిషన్‌కు రమ్మంటారని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ ఫోన్ రాగానే నాకు చాలా భయం వేసింది. ఎంతో కంగారు పడ్డాను. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. సెట్స్ మీదకు వెళ్లే వరకు కూడా నేను ఇందులో భాగమయ్యానని నమ్మలేకపోయాను’’ అని ఆమె పేర్కొంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పనిచేయడం గురించి సన్నీ స్పందిస్తూ.. ‘‘షూటింగ్ సమయంలో మేము మా జీవితాల్లోని రకరకాల కథల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆయన నన్ను ఒక మనిషిగా గుర్తించారు. ఆయన వద్ద నేను మానసిక ప్రశాంతతను, భద్రతను అనుభవించాను. అది నేను తెరపై బాగా నటించడానికి ఎంతో సహాయపడింది’’ అని ఎమోషనల్ అయింది.

రిస్క్ ఉన్నప్పుడు డూప్ ఉండటం సహజం.. కానీ ఆ స్టంట్స్ నావే: మాళవిక మోహనన్

Next Story