రిస్క్ ఉన్నప్పుడు డూప్ ఉండటం సహజం.. కానీ ఆ స్టంట్స్ నావే: మాళవిక మోహనన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-14 04:35:55  IST  )

‘ది రాజాసాబ్’ సినిమాలో మీరు చూసిన యాక్షన్ సీక్వెన్స్‌లో నేను స్వయంగా పాల్గొన్నాను.

రిస్క్ ఉన్నప్పుడు డూప్ ఉండటం సహజం.. కానీ ఆ స్టంట్స్ నావే: మాళవిక మోహనన్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి (Maruthi)కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). ఈ సినిమాను కామెడీ, హరర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించగా.. ఇందులో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఇందులో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా చాలా స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో కనిపించాడు. సంక్రాంతి కానుకగా.. విడుదలై.. బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. కానీ విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇటీవల ఇక యాక్షన్ ఎపిసోడ్‌లో మాళవిక తన స్టంట్స్ తాను చేయలేదని.. ఆమెకు బదులుగా ఒక స్టంట్ డబుల్ బాడీ డూప్ చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్స్‌లో ఓ అమ్మాయి మాళవిక వేసుకున్న డ్రెస్ వెసుకుని ఉన్న ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. తాజాగా, ఈ విషయంపై మాళవిక తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.

శారీరక సవాళ్లను స్వీకరించడం ఇష్టం

తాను రోప్స్ సాయంతో గాలిలో వేలాడుతూ ప్రాక్టీస్ చేస్తున్న బిహైండ్‌ది సీన్స్ వీడియోను ప్రూఫ్‌గా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె రెండు ముఖ్యమైన విషయాలను వివరిస్తూ.. “నేను చిన్నప్పటి నుండి స్పోర్టీ గర్ల్‌ని. కొత్త విషయాలు నేర్చుకోవడం, శారీరక సవాళ్లను స్వీకరించడం నాకు చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లను నేను నిజంగా ఎంజాయ్ చేస్తూ చేశాను. నటులు స్వయంగా స్టంట్స్ చేస్తున్నా కూడా, సెట్స్‌లో ప్రొఫెషనల్ స్టంట్ డబుల్స్ ఎప్పుడూ ఉంటారు. నటులు చివరి షాట్ ఇచ్చే ముందు రిహార్సల్స్ కోసం లేదా అత్యంత రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు, నిపుణుల సలహాలు వారి సాయం తీసుకోవడం చిత్ర పరిశ్రమలో సర్వసాధారణం. కానీ సినిమాలో మీరు చూసిన యాక్షన్ సీక్వెన్స్‌లో నేను స్వయంగా పాల్గొన్నాను. అమ్మాయిలకు సినిమాల్లో యాక్షన్ సీన్స్ రావడం చాలా అరుదు. అందుకే ఇష్టమైన స్టంట్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. అయినప్పటికీ ట్రోల్ చేయడం బాధాకరం. దయచేసి తప్పుడు వార్తలు సృష్టించకండి”అని రాసుకొచ్చింది.

Next Story