‘స్వయంభు’సినిమాను జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాను.. నిఖిల్ సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-11 08:08:58  IST  )

'హ్యాపీడేస్' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి 19 ఏళ్లు పూర్తి చేసుకున్న నిఖిల్(Nikhil Siddharth), తన 22వ చిత్రంగా ‘స్వయంభు’(Swayambhu)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

‘స్వయంభు’సినిమాను జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాను.. నిఖిల్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: 'హ్యాపీడేస్' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి 19 ఏళ్లు పూర్తి చేసుకున్న నిఖిల్(Nikhil Siddharth), తన 22వ చిత్రంగా ‘స్వయంభు’(Swayambhu)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక యాక్షన్ డ్రామా టీజర్ ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిఖిల్ తన కెరీర్ లోని అప్స్ అండ్ డౌన్స్ గురించి, ఈ సినిమా ప్రత్యేకత గురించి ఎమోషనల్ అయ్యారు. ఈ వేదికపై నిఖిల్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘స్వయంభు అంటే ఏదో ఊహించి రాసిన కథ కాదు. ఇది మన రాయలసీమలో నిజంగా జరిగిన ఒక యువకుడి వీరగాథ.

ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం గత రెండేళ్లుగా నేను ఎవ్వరికీ కనిపించకుండా కష్టపడ్డాను. నిఖిల్ మనవాడు అని మీరు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’’ అని నిఖిల్ పేర్కొన్నారు. నిజానికి ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కానీ, రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలపై నిఖిల్ స్పందిస్తూ.. ‘‘కార్తికేయ-2 లాంటి భారీ విజయం తర్వాత ప్రేక్షకులకు అంతకంటే క్వాలిటీ ఉన్న సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ఈ సినిమా చేశాను. ఖచ్చితంగా మీ అంచనాలకు ఏమాత్రం తగ్గదు’’ అని భరోసా ఇచ్చారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం, తెలుగుతో పాటు మిగిలిన భారతీయ భాషల్లో ఘనంగా విడుదల కానుంది.

చరిత్ర తిరగరాసే యోధుడు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘స్వయంభు’ టీజర్‌

Next Story