- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గుగా అనిపించింది.. సమంత అత్త సెన్సేషనల్ కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)డిసెంబర్ 1న డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)డిసెంబర్ 1న డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. వీరి వివాహం సాంప్రదాయ బద్ధంగా భూతశుద్ది పద్ధతిలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక ఈ వివాహంలో ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక వెంటనే సమంత అత్తారింటికి వెళ్లగా.. అక్కడ గ్రాండ్‌గా స్వాగతం పలికిన అత్తింటివారితో ఉన్న సమంత ఫొటో ఫుల్ వైరల్ అయింది.
ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో సింగర్‌గా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న శోభారాజ్ కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు. ఆమె మరెవరో కాదు.. రాజ్ నిడిమోరుకు చిన్నమ్మ కావడం విశేషం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభారాజ్ సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఆమె నాకు కోడలిగా రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి అమ్మాయి.. పద్ధతిగా ఉంటుంది. పెళ్లి చీరలో చాలా ముచ్చటగా ఉంది. ఇలాంటి అమ్మాయిని నా కొడుకు రాజ్ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. గతంలోనే సమంత నాకు తెలుసుకు. ఈషా ఫౌండేషన్‌లో రెండు సార్లు కలిశాను. ఆ సమయంలో అమ్మాయి చాలా సన్నగా ఉండేది.
అంత సన్నగా ఉన్న సమంత పక్కన కూర్చోవాలంటే నాకు కాస్త సిగ్గుగా అనిపించింది. అప్పుడే నేను స్లిమ్‌గా అవ్వాలంటే ఏం చేయాలని అడిగాను. అందుకు ఆమె కొన్ని డైట్స్, వర్కౌట్స్ చేయాలని చెప్పింది. కానీ అది నా వల్ల కాలేదు. సమంత అవన్నీ చేయడం గ్రేట్. రాజ్ వాళ్ల అమ్మ కంటే నా దగ్గరే ఎక్కువ ఉండేవాడు. సినిమాను తెరకెక్కించడంతో పాటు రాజ్ పాటలు అద్భుతంగా పాడగలడు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Read More..
మా ఇద్దరి మధ్య గొడవలు నిజమే.. విడాకుల రూమర్స్ పై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ






