మా ఇద్దరి మధ్య గొడవలు నిజమే.. విడాకుల రూమర్స్ పై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ

by Naga Rani Yarlagadda |

రూమర్లను పక్కనపెట్టి పెళ్లి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నట్లు తెలిపారు.

మా ఇద్దరి మధ్య గొడవలు నిజమే.. విడాకుల రూమర్స్ పై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. ఏ జంటైనా పెళ్లి చేసుకుంటే అది మూన్నాళ్ల ముచ్చటేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. ఇక ఎవరైనా విడాకులు అనౌన్స్ చేస్తే.. ముందే ఊహించామనో, ఇది కామన్ అయిపోయిందనో పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ విడాకుల రూమర్స్ గతేడాది పెళ్లి చసుకున్న సోనాక్షి సిన్హాను చుట్టుముట్టాయి. ఇటీవల నటి సోహా అలీఖాన్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. జహీర్ ఇక్బాల్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు వస్తున్న రూమర్లపై ఆమెను అడగ్గా.. ఇదంతా న్యూసెన్స్ అని కొట్టిపారేశారు.

రూమర్లను పక్కనపెట్టి పెళ్లి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నట్లు తెలిపారు. కానీ.. తామిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న విషయం నిజమేనని కుండబద్దలు కొట్టారు. అందరిలాగే తమ మధ్య కూడా అభిప్రాయ బేధాలు వచ్చాయని, జుట్టు పట్టుకుని పీక్కునేంతలా గొడవపడ్డామని చెప్పుకొచ్చారు. ఏడేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నా.. ఈ స్థాయిలో గొడవలు జరిగాయని వెల్లడించారు. ఎన్ని గొడవలు వచ్చినా బ్రేకప్ చెప్పుకోకుండా పరిష్కరించుకున్నామన్నారు. జహీర్ ఇతరులను గౌరవించే పద్ధతి తనకెంతో నచ్చిందన్నారు. కపుల్స్ థెరపీ ద్వారా తన బంధాన్ని మరింత బలంగా చేసుకున్నామని చెప్తూ.. విడాకుల రూమర్స్ కు సోనాక్షి చెక్ పెట్టింది. ఇటీవల విడుదలైన జటాధర సినిమాలో సోనాక్షి కీలకపాత్ర పోషించింది.

Next Story