- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్‌తో పని చేస్తే కానీ ఆయన అసలు రూపం తెలియలేదు: చిత్రాంగద సింగ్
సల్మాన్ ఖాన్ గురించి బయట చాలా రకాలుగా చెప్పుకుంటారు. ఆయన సమయపాలన పాటించరని, అన్-ప్రొఫెషనల్ అని చాలామంది నాకు చెప్పారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ నటిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసింది. అతి తక్కువ సమయంలోనే స్టార్స్‌తో నటించే చాన్స్ దక్కించుకుని తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్‌కే ప్రాధాన్యత ఇవ్వకుండా.. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణం, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఒక నటిగా తను నేర్చుకున్న పాఠాలు తోటి నటుడు సల్మాన్ ఖాన్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదని, కష్టపడే తత్వం కూడా ఉండాలని చిత్రాంగద స్పష్టం చేశారు. "మనం ఎప్పుడూ మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ అది వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకపోతే ఆ అవకాశం వృధా అవుతుంది. అందుకే మన పని మనం చేసుకుంటూ పోవాలి" అని ఆమె సూచించారు. తన తండ్రి చెప్పిన మాటలే తనను ఇక్కడి వరకు తీసుకొచ్చాయని ఆమె తెలిపారు. తన మొదటి సినిమాలోనే ఒక బలమైన పాత్ర రావడం తన అదృష్టమని, ప్రతి సినిమా తన గురించి తాను కొత్తగా తెలుసుకోవడానికి సహాయపడిందని ఆమె వివరించారు.
అలాగే ‘మాతృభూమి’ షూటింగ్ సమయంలో సల్మాన్‌తో పనిచేసిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. "సల్మాన్ ఖాన్ గురించి బయట చాలా రకాలుగా చెప్పుకుంటారు. ఆయన సమయపాలన పాటించరని, అన్-ప్రొఫెషనల్ అని చాలామంది నాకు చెప్పారు. కానీ ఆయనతో పనిచేస్తే కానీ నాకు అసలు విషయం తెలియలేదు" అని ఆమె అన్నారు. ఆయన గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ.. "సల్మాన్ సెట్స్‌లో అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. షూటింగ్‌లో ఉండే క్రూ మెంబర్స్ పట్ల కూడా ఆయనకు చాలా శ్రద్ధ ఉంటుంది. సల్మాన్ చాలా ఈజీగా కలిసిపోయే మనిషి. ఆయన ఎప్పుడూ ఆలస్యంగా వస్తారని అందరూ అంటుంటే.. నేను ఉదయాన్నే షూటింగ్‌కు వస్తానని తెలిసి, నా కోసం ఆయన కూడా అందరికంటే ముందే సెట్స్‌కు వచ్చేవారు" అని సల్మాన్ మంచితనాన్ని కొనియాడారు.






