- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమె నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా: యష్
ఈ సినిమాలో శృంగార సన్నివేశాల దగ్గర నుండి భారీ యాక్షన్ బ్లాక్స్ వరకు.. ప్రతి విషయంలోనూ గీతూ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ తన రాబోయే చిత్రం ‘టాక్సిక్’ గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా యష్ తన దర్శకురాలి పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. సాధారణంగా గ్యాంగ్‌స్టర్ డ్రామాలు అంటేనే ఒక రకమైన ఊరమాస్, రక్తపాతం, తుపాకుల మోత కనిపిస్తుంది. ఇలాంటి భారీ కథలను కేవలం పురుష దర్శకులు మాత్రమే పవర్‌ఫుల్‌గా తీయగలరని చాలామంది భావిస్తుంటారు. అయితే, గీతూ మోహన్ దాస్ ఈ కథను ఒక మహిళా కోణంలో ఎలా ఆవిష్కరించారో చూస్తే అందరూ ఆశ్చర్యపోతారని యష్ ధీమా వ్యక్తం చేశారు. గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యంలోనూ ఇంతటి లోతైన భావోద్వేగాలు ఉంటాయని ఈ సినిమా నిరూపిస్తుందని ఆయన అన్నారు.
యష్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో శృంగార సన్నివేశాల దగ్గర నుండి భారీ యాక్షన్ బ్లాక్స్ వరకు.. ప్రతి విషయంలోనూ గీతూ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సున్నితమైన భావాలను ఎంత బాగా చూపించారో, యాక్షన్ సీన్స్‌ను కూడా అంతే పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. ఒక లేడీ డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాను ప్రజెంట్ చేయగలరా? అని ఆమెతో కలిసి ప్రయాణించాకే నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చారు. గీతూ మోహన్ దాస్ నుంచి తాను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని యష్ పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం చాలా విభిన్నంగా ఉంటుందని, గతంలో తాము చూసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జూన్ 4న ఈ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు వెండితెరపై చూసి థ్రిల్ అవుతారని యష్ వెల్లడించారు. ‘కేజీఎఫ్’ వంటి భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






