అక్రమాస్తుల కేసు.. చంచల్ గూడ జైలుకు డీఎస్‌పీ భీమ్ రెడ్డి తరలింపు

by Malleboina Mahesh |

డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం సాయంత్రం అధికారికంగా అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైలుకు తరలించారు.

అక్రమాస్తుల కేసు.. చంచల్ గూడ జైలుకు డీఎస్‌పీ భీమ్ రెడ్డి తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖలో సంచలనంగా మారిన డీఎస్‌పీ భీమ్ రెడ్డి (DSP Bheem Reddy) అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసులో హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం సాయంత్రం అధికారికంగా అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం భీమ్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో జరిపిన మెరుపు సోదాల (ACB Raids) అనంతరం ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు జడ్జి ముందు హాజరు పరిచారు. దీంతో అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా ఏసీబీ అధికారులు భీమ్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే పూర్తి స్థాయి విచారణ కోసం ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story