- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొలెరో బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
44వ జాతీయ రహదారిపై పొద్దున్నేఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.

దిశ, అలంపూర్: 44వ జాతీయ రహదారిపై పొద్దున్నేఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం జోగులాంబ గద్వాల జిల్లా 44వ జాతీయ రహదారిపై జల్లాపురం స్టేజీ సమీపంలో రోడ్డుపై ఒక్కసారిగా స్కిడ్ అయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న అభి (26), సోమన్న (44) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహనాన్ని లక్ష్మీపుత్ర (28) నడుపుతున్నారు. ప్రమాదం తీవ్రతను చూస్తే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని, కానీ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జరుగుతున్న కల్వర్టు నిర్మాణంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. హుటాహుటిన సంఘటన స్థలానికి 108 వాహనం చేరుకొని క్షతగాత్రులను కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంకు మరొకడు పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వారందరూ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.






